సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నయీమ్ డిమాండ్ చేశారు. సోమవారం వివిధ సంఘాల నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15వేలకు పెంచాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయ కులు ఎండీ.జహీర్ బాబా, జయకృష్ణ, కురి నాగయ్య, నల్లగొండ నాగయ్య, ఏలె జానయ్య, వీరమల్ల యాదగిరి, ఎరుకల రవి, అఖిల్, ధరావత్ రవి, సుశీల, వీరమ్మ, అక్కమ్మ, సరిత, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.


