నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

హుజూర్‌నగర్‌ : రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ చినమేలు అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలపై సరైన క్లియరెన్స్‌ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు, ఇతర ఆర్థిక పరమైన అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సాగునీరు, రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలవుతుందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్‌ప్రసాద్‌, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత, నాయకులు సీత అనూష, వన్నాల వెంకటరమణ, ఆకుల భిక్షమయ్య, పట్టణ అధ్యక్షుడు కొండా హరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ చినమేలు అంజిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement