పవిత్రోత్సవాలు పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

పవిత్రోత్సవాలు పరిసమాప్తం

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

మఠంపల్లి: మట్టపల్లిలోని శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సహిత భక్తప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు సమక్షంలో పవిత్ర విసర్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో శ్రీస్వామి వారికి వైఖానస శాస్త్రానుసారంగా అగ్నిరాధనలు, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాలతో చేపట్టారు. అనంతరం సప్తదశ కుంభారోపణం, మహాశాంతి హోమం, శాంతికల్యాణ మహోత్సవం, ఆచార్యాది సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. నీరాజనమంత్ర పుష్పాలతో భక్తులకు తీర్థప్రసాద వినియోగములు గావించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ నిర్వాహకులు వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ తుమ్మల వెంకటాచలపతిరావు, తూమాటి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, బ్రహ్మాచార్యులు, అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, సాయికుమారాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మట్టపల్లిలో చివరి రోజు వైభవంగా పవిత్ర విసర్జనోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement