జీతాలు చెల్లించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రంథాలయాల్లో పార్ట్‌టైం వర్కర్లుగా పనిచేసే సిబ్బందికి నెలానెలా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 18 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే పార్ట్‌టైం వర్కర్స్, పార్ట్‌టైం స్వీపర్లు, ఇతర సిబ్బంది మొత్తం 35 మంది వరకు ఉంటారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు అందడంలేదు. అంతేకాకుండా గ్రంథాలయాల్లో పేపర్, తాగునీటి, విద్యుత్ బిల్లులు సరైన సమయానికి విడుదల కావడం లేదు.
ఉద్యోగ భద్రత లేదు
శాఖా గ్రంథాలయాల్లో సిబ్బంది ఏళ్లకొద్ది పనిచేస్తున్నా ఎవరికీ పర్మినెంట్ కాకపోవడంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 20 సంవత్సరాలకుపైగా పనిచేస్తున్నా ఏ ఒక్కరికి పర్మినెంట్ కాలేదని పేర్కొంటున్నారు. గ్రంథాలయాల్లో పనిచేసే ఇన్చార్జి లైబ్రేరియేన్లకు రూ.20 వేలు, పార్ట్‌టైం వర్కర్లకు రూ.15,600, పార్ట్‌టైం స్వీపర్లకు రూ.7000 ఇస్తున్నారు. వచ్చే కొద్దిపాటి జీతాలు ప్రతినెలా రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే కొద్దిపాటి జీతమైనా ఈ దసరా పండుగకై నా అందించాలని సిబ్బంది కోరుతున్నారు.
గ్రంథాలయ ఉద్యోగులకు
ఆరు నెలలుగా అందని జీతాలు
పండుగ వరకై నా అందించాలని
సిబ్బంది వేడుకోలు
33 సంవత్సరాలుగా గ్రంథాలయంలో పని చేస్తున్నాను. వచ్చే కొద్దిపాటి జీతం కూడా ప్రతినెలా రావడం లేదు. ఈ నెల కూడా జీతం రాలేదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి.
– పాలబిందెల సోమయ్య, అసిస్టెంట్
లైబ్రేరియన్, తిరుమలగిరి


