మునగాల, చిలుకూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై ఆదివారం మునగాల, చిలుకూరులో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓటుకు అర్హత కలిగిన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సదస్సుల్లో బీఆర్ఎస్ పార్టీ మునగాల మండల నాయకులతోపాటు చిలుకూరులో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, సర్పంచ్ వీరబాబు, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, మాజీ జెడ్పీటీసీ భట్టు శివాజీనాయక్, మాజీ ఎంపీపీ కొండా అన్నపూర్ణ, మండల నాయకులు తాళ్లూరి శ్రీను, అంబాల వెంకటి, షేక్ పాషా, బానోతు వాసు, అమరగాని లింగరాజు, మాధవరపు శ్రీను, మేకపోతుల శ్రీను, తిపిరిశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ మాజీ ఎమ్మెల్యే
బొల్లం మల్లయ్య యాదవ్


