సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధన దీక్షలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావా లని సూర్యాపేట మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆది వారం 59వ రోజు కొనసాగిన బుల్లెట్ రైలు సాధన రిలే నిరాహార దీక్షలో బుల్లెట్ రైలు సాధన కమిటీ సభ్యులు, సామాజిక ఉద్యమకారులు, వివిధ పార్టీల నేతలు కూర్చున్నారు. దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బుల్లెట్ రైలు, రైల్వే కారిడార్ మొదటి అలైన్మెంట్ను మార్చే కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేద్దామన్నారు. ఈ దీక్షలో వెలుగు వనిత, చల్లమల్ల నర్సింహ యార్కచర్ల శోభారాణి, బయ్య మల్లికార్జున్, వాసుదేవరావు,సట్టు నాగయ్య, రవి, పద్మ కూర్చోగా రమణాచారి, ధర్మార్జున్ తదితరులు సంఘీభావం తెలిపారు.


