బుల్లెట్‌ రైలు మళ్లింపు కుట్రను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు మళ్లింపు కుట్రను తిప్పికొట్టాలి

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటాలు, భూస్వామ్య ఉద్యమాల చరిత్ర కలిగిన సూర్యాపేటకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్‌ రైలు మళ్లింపు కుట్రలను ప్రజలు ఐకమత్యంగా తిప్పికొట్టాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి పిలుపునిచ్చారు. బుల్లెట్‌ రైలు సాధన ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో గురువారం సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్‌ మాట్లాడుతూ.. బుల్లెట్‌ రైలు జాతీయ రహదారి 65 సూర్యాపేట మీదుగా వెళ్లే విధంగా ప్రధాన పార్టీలు తీర్మానాలు చేయించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌ కుమార్‌, కురుకుంట్ల సైదులు, నాగయ్య, దుర్గయ్య, నర్సిరెడ్డి, సింహాద్రి నర్సక్క, ప్రవీణ్‌, శ్రీప్రియ, కిరణ్‌ శ్రీహాన్‌, చలమల్ల నరసింహ, భూపతి రాములు, వనిత, నాగయ్య, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement