సూర్యాపేట : పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని స్టార్ బ్లాంకెట్ హాల్‌లో తొమ్మిదో పోషణ మాసం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నపాసన చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు తయారీ చేసి ప్రదర్శించిన చిరుధాన్యం వంటలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదితలక్షాది, వైస్ చైర్మన్ షఫీఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సీడీపీఓ సుబ్బలక్ష్మి, కౌన్సిలర్లు జహీర్, తాహెర్, అంజలి, వీరమ్మ, నాగమ్మ, కళావతి, జ్యోతి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


