ఫిర్యాదు వస్తేనే కదులుతారా..? | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు వస్తేనే కదులుతారా..?

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం

దాబా, రెస్టారెంట్లకు జరిమానా

సూర్యాపేటటౌన్‌ : చాలా హోటళ్లు, బేకరీల్లో వంటగదులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. నాణ్యత లేని వంటనూనెలు, కాలం చెల్లిన ముడిసరుకులను వినియోగిస్తున్నారని, కొన్ని నాన్‌వెజ్‌ హోటళ్లలో రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగదారులకు వండి పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని, ముందస్తు తనిఖీలు చేపట్టడం లేదని ప్రజల నుంచి విమర్శలు ఉన్నాయి.

500కు పైగా కేంద్రాలు..

జిల్లా పరిధిలో సుమారు 200 నుంచి 250 వరకు హోటళ్లు, 280 నుంచి 320 వరకు బేకరీలు నడుస్తున్నట్లు అంచనా. మొత్తంగా 500కు పైగా ఆహార విక్రయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో ఈ నెల 30న ఓ వినియోగదారుడు ఆహార పదార్థం కొనుగోలు చేయగా, అది బూజు పట్టినట్లు గుర్తించాడు. దీంతో సంబంధిత ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు బేకరీలో తనిఖీలు నిర్వహించారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపించారు. అనంతరం నిబంధనల మేరకు బేకరీని సీజ్‌ చేసి యజమానికి రూ.10వేలు జరిమానా విధించారు. రోజు వారీగా వేలాది మంది ఆహారం కొనుగోలు చేసే ఈ కేంద్రాలపై క్రమం తప్పకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాల్సి న అవసరం ఎంతైనా ఉంది.

171 శాంపిళ్లు.. 15 కేసులు

ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 171 ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించినట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 15 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని హోటళ్లు, బేకరీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే తనిఖీలు మరింత విస్తతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు. హోటళ్లు, బేకరీల్లో ఆహార పదార్థాల తయారీ విధానం, కిచెన్ల పరిశుభ్రత, ముడిసరుకుల నాణ్యత, నిల్వ పద్ధతులు, కాలం చెల్లిన పదార్థాల వినియోగం తదితర అంశాలను అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరుతున్నారు.

హోటళ్లు, బేకరీల్లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ఫుడ్‌ కలర్స్‌ వినియోగం, ముడి సరుకుల నిల్వ, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– ప్రభాకర్‌, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి

ఫ హోటళ్లు.. బేకరీల్లో

అపరిశుభ్ర కిచెన్లు, నిల్వ ఆహారం

ఫ నామమాత్రంగా తనిఖీలు

నిర్వహిస్తున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

ఫ జిల్లా వ్యాప్తంగా 500కు పైగా హోటళ్లు, బేకరీలు

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలో ఫుడ్‌ సేప్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మాంసాహారం, పన్నీరు, గడువు దాటిన ఆహార పదార్థాలు ఉండటంతో సీజ్‌ చేశారు. చెర్రి దాబాలో, సునీత రెస్టారెంట్‌లు అపరిశుభ్రంగా ఉండటంతో చెర్రి దాబాకు రూ.10 వేలు, సునీత బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.2 వేల జరిమానా విధించారు. అయితే ఫుడ్‌ సేప్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో స్థానిక క్రాస్‌ రోడ్డులో ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు ముందే మూసి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement