గరిడేపల్లి: ప్రజా పాలనతోనే ప్రజలకు సంక్షేమం అందుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం పూర్తయితే గడ్డిపల్లి ప్రాంతం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్య పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు అందించే విధంగా ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అడ్మిషన్లు కూడా జరగాలని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటో గ్యాలరీని ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, గడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుందరి నాగేశ్వరరావు, సర్పంచి మాశెట్టి నాగలక్ష్మి శ్రీహరి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండు రామాంజిగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం వేణు, మాజీ ఎంపీపీలు పైడిమర్రి రంగనాథ్, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, కటకం రమేష్, మూలగుండ్ల సీతారామరెడ్డి, ఆరే కృష్ణారెడ్డి, బచ్చలకూరి కృష్ణ, చింతకాయల సైదులు, బల్దూరి సందీప్, పాకాల పరమేష్, గారకుంట తండా సర్పంచ్ అరుణ రమేష్, హుజూర్నగర్ ిసీఐ చరమండరాజు, తహసీల్దార్ స్రవంతి, ఎంపీడీఓ సరోజ పాల్గొన్నారు.
ఫ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క


