సంతకాల పంచాయితీకి ‘చెక్‌’ | - | Sakshi
Sakshi News home page

సంతకాల పంచాయితీకి ‘చెక్‌’

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

ఫ గ్రామపంచాయతీల జాయింట్‌

చెక్‌ పవర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫ ఉపసర్పంచ్‌ సంతకం పెట్టకపోతే

కలెక్టర్‌కు చెక్‌ పవర్‌ రద్దు చేసే అధికారం

భానుపురి (సూర్యాపేట): గ్రామపంచాయతీల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సర్పంచ్‌, ఉపసర్పంచుల ఆధిపత్య పోరుకు, జాయింట్‌ చెక్‌ పవర్‌ ‘సంతకాల’ వివాదానికి తెరపడనుంది. పంచాయతీ నిధులను డ్రా చేసే విషయంలో సర్పంచులకు, ఉపసర్పంచులకు మధ్య రాజకీయ, వ్యక్తిగత కారణాలతో విభేదాలు వచ్చి నిధుల ఉపసంహరణ నిలిచిపోతోంది. ఉపసర్పంచులు సంతకాలు చేయకుండా ఆలస్యం చేస్తుండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, అత్యవసర నిర్వహణ స్తంభించిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెక్కు జారీ చేసిన 7 పని దినాల్లో ఉపసర్పంచ్‌ అకారణంగా సంతకం చేయకపోతే, కలెక్టర్‌ విచారణ జరిపి సదరు ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేసే వెసులుబాటును కల్పించింది.

గ్రామాల్లో ఆధిపత్య పోరు..

జిల్లాలోని 486 గ్రామపంచాయతీలకు డిసెంబర్‌ లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కొందరు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు వార్డు మెంబర్లుగా నిలిచారు. వీరు ఎన్నికల ఖర్చులు పెట్టుకొని ఉపసర్పంచులుగా ఉన్నారు. జాయింట్‌ చెక్‌పవర్‌ కారణంగా తాము పెట్టిన ఖర్చులు కొంతైనా తిరిగి వస్తుందని భావించారు. ప్రస్తుత పాలకవర్గాల మధ్య సయోధ్య ఉన్నచోట ఎలాంటి వివాదాలు లేకుండానే నిధుల వినియోగం జరుగుతోంది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ప్రత్యర్థ పార్టీలు అయినచోట నిధుల డ్రా విషయంలో పంచాయతీలు వస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాగా.. సమస్య పరిష్కారానికి మధ్య మార్గంగా కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఉత్తర్వుల ప్రకారం.. నిధుల చెక్కు జారీ అయిన తర్వాత 7 పని దినాల్లో ఉపసర్పంచ్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. తగిన కారణం లేకుండా నిరాకరిస్తే సర్పంచ్‌ నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టర్‌ విచారణ చేపట్టి ఉపసర్పంచ్‌కు ఉన్న చెక్‌ పవర్‌ను రద్దు చేసి, పంచాయతీ కార్యదర్శికి గానీ లేదా ప్రత్యేక అధికారికి గానీ సంతకం చేసే బాధ్యతను అప్పగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement