సన్నధాన్యానికి అధిక ధర | - | Sakshi
Sakshi News home page

సన్నధాన్యానికి అధిక ధర

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

తిరుమలగిరి ( తుంగతుర్తి) : మార్కెట్లో సన్న, దొడ్డు ధాన్యాలకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధిక ధరలు పలుకుతున్నాయి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 5068 బస్తాల ధాన్యం రాగా.. సన్నధాన్యం (సాంబ మసూరి) క్వింటాకు రూ.3,510 ధర పలికింది. కనిష్టంగా రూ.2500, దొడ్డు ధాన్యానికి క్వింటా రూ.2480, కనిష్టంగా రూ.2160 ధర పలికింది. జనగామ జిల్లా గ్రామానికి చెందిన ధరావత్‌ మోతీలాల్‌ అని రైతు సన్నధాన్యం మార్కెట్‌కు తీసుకురాగా క్వింటాకు రూ.3510 ధర వచ్చింది.

బుల్లెట్‌ రైలును

అడ్డుకుంటున్న గురుశిష్యులు

సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్‌ రైలు రాకుండా గురు శిష్యులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన బుల్లెట్‌ రైలు సాధన రీలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. గత 54 రోజులుగా బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు బీజేపీ సంపూర్ణ మద్దతు కొనసాగిస్తుందన్నారు. బీజేపీ సూర్యాపేట మండల అధ్యక్షుడు అలుగుబెల్లి సైదిరెడ్డి, పెన్‌పహాడ్‌ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి మధు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. సుధా బ్యాంకు ఎండీ పెద్దిరెడ్డి గణేశ్‌ వీరికి పళ్ళ రసాలు ఇచ్చి దీక్ష విరమింప చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణ, రమణాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, దేవుడి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement