ప్రభుత్వాలు పక్కా ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలు పక్కా ప్రణాళిక రూపొందించాలి

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

హుజూర్‌నగర్‌ : కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు పక్కా ప్రణాళిక రూపొందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒక్కవంతుల కోటేశ్వరరావు అన్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని హనుమా లింగయ్య భవన్‌లో మంగళవారం రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాస్‌ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావం –కరువు పరిస్థితులు అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కవంతుల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో దేశమంతా కరువు కరాల నృత్యం చేస్తున్నదని, దీనిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా లేవని ఆరోపించారు. ప్రజలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడువునా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆర్డీఓ శ్రీనివాసులుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, కొప్పోజు సూర్యనారాయణ, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వర రావు, కాకి అజయ్‌, కనకారావు, మురళి, వెంకటయ్య, ప్రసాద్‌, సైదులు, పాపిరెడ్డి, వెంకటరెడ్డి, వెంకట్‌ నారాయణ, వెంకన్న, శ్రీనివాస సునీల్‌, గిరి, కోటయ్య, వెంకటేశ్వర్లు, రమేష్‌, చంద్రం, వీరబాబు, మల్లయ్య పాల్గొన్నారు.

ఫ రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ

అధ్యక్షుడు ఒక్కవంతుల కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement