గురుకుల విద్యార్థుల సమస్యలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థుల సమస్యలు పట్టవా?

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

మునగాల: మునగాల మండలంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ పేరుతో హంగులు, ఆర్భాటాలు చేస్తున్నారని.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రం నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాలల్లో తరచూ ఆహార కలుషిత ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌ ఎడమకాలువకు నీటిని విడుదల చేయాలన్న ధ్యాస లేకుండా మంత్రి ఉత్తమ్‌ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మండల పార్టీ నాయకులు కందిబండ సత్యనారాయణ, రామయ్య, ఉడుం కృష్ణ, గడ్డం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement