కబళిస్తున్న క్యాన్సర్‌ | - | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న క్యాన్సర్‌

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

భువనగిరి : క్యాన్సర్‌ మహమ్మారి పల్లెలకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, అవగాహన లోపం తదితర కారణాలతో ప్రజలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వందలాది మంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నట్లు నాన్‌–కమ్యూనికబుల్‌ డిసీజేస్‌ (ఎన్‌సీడీ) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

మహిళలే అధికం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్‌సీడీ సర్వే ప్రకారం 2,831 మంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ బాధితులు 388 మంది, రొమ్ము క్యాన్సర్‌ బాధితులు 395 మంది ఉన్నారు. ఇతర క్యాన్సర్‌ రోగులు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 232 మంది ఉన్నారు. అయితే నోటి క్యాన్సర్‌ రోగులు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 91 మంది ఉన్నారు. క్యాన్సర్‌ బాధితుల్లో నల్ల గొండ జిల్లాలో మహిళలే అధికంగా ఉన్నారు. రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. పొగాకు, గుట్కా, ధూమపానం వంటి వ్యసనాలతో వందలాది మంది నోటి క్యాన్సర్‌ బారినపడుతున్నట్టు సర్వేలో తేలింది.

వ్యాప్తికి కారణాలివే..

క్యాన్సర్‌ వ్యాధి బారిన పడటానికి గల ప్రధాన కారణాలను వీటిని తీసుకోవచ్చు. ఇందులో శారీక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, ఆలస్యంగా వివాహం జరగటం, పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోవడం తదితర కారణాలతో రోమ్ము క్యాన్సర్‌ వస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం, హెచ్‌పీవీ సంక్రమణ, చిన్న వయస్సులోనే వివాహం కావడం తరచూ గర్భధారణ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, గుట్కా ఖైనీ, జర్థా నమలటం, ధూమపానం, మద్యపానం తీసుకోవడం వంటి అలవాట్లతో నోటి క్యాన్సర్‌ వ్యాపిస్తుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులతోపాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఉచితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ ఆస్పత్రికి పంపుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఖరీదైన కిమోథెరపీ, రేడియేషన్‌, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు.

ఫ రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులు

ఫ ఉమ్మడి జిల్లాలో

2,831 మంది బాధితులు

ఫ ఎన్‌సీడీ సర్వేలో వివరాలు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement