పోలీస్‌ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

సూర్యాపేట(సూర్యాపేటటౌన్‌) : ఎస్‌ఐ, కానిస్టేబు ల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా యంత్రాంగం, పోలీసుల ఆధ్వర్యంలో అందించనున్న ఉచిత శిక్షణకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆదివారం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. 1600 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా పరీక్షకు 1,220 మంది హాజరయ్యారు. సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడ కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, హుజూర్‌నగర్‌ గ్రీన్‌న్‌ వుడ్‌ పాఠశాల, తిరుమలగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ కె.నరసింహ సందర్శించి, పరీక్ష సరళిని పరిశీలించారు. ఆయన వెంట ట్రైనీ ఐఏఎస్‌ అనూషా, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, పట్టణ ఇన్‌స్పెక్టర్‌న వెంకటయ్య, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, డీటీ ఉన్నారు.

ఫ జిల్లా వ్యాప్తంగా 1220 మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement