సన్న బియ్యానికి రెక్కలు | - | Sakshi
Sakshi News home page

సన్న బియ్యానికి రెక్కలు

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

వినియోగదారులపై ప్రభావం..

సూర్యాపేటటౌన్‌ : సన్న బియ్యం ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాపై రూ.2 వేల వరకు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సన్న రకాల వరి సాగు తగ్గడం, ఈ సారి దిగుబడి తగ్గుతుందన్న అంచనాలు, మార్కెట్‌లో బియ్యం నిల్వలు తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సన్న రకం ధాన్యం కొరత ఏర్పడవచ్చన్న అంచనాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.

భారీగా పెరుగుదల

సూర్యాపేట జిల్లాలో బీపీటీ రకం క్వింటా ప్రస్తు తం సుమారు రూ.7వేలకు చేరింది. నెల క్రితం ఇదే రకం ధర రూ.5వేలుగా ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజుల్లోనే క్వింటాపై సుమారు రూ.2వేల వరకు ధర పెరిగింది. అలాగే ఆర్‌ఎన్‌ఆర్‌ రకం బియ్యం ప్రస్తుతం క్వింటాకు సుమారు రూ.7,500 నుంచి రూ.8వేల వరకు పలుకుతుండగా, నెల క్రితం రూ.5,500గా ఉంది. దాంతో బియ్యం వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులతో పాటు వినియోగదారులపైనా ధరల ప్రభావం పడుతోంది. బియ్యం ధరలు పెరగడంతో చిల్లర మార్కెట్‌లో సైతం ధరలు పెరుగుతున్నాయి.

సాగు తగ్గుతుందన్న అంచనాలు..

ఈ సంవత్సరం వరి సాగు, దిగుబడిపై వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుందన్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. సన్న రకాల వరి సాగు తగ్గితే భవిష్యత్తులో ధాన్యం లభ్యత తగ్గుతుందన్న అంచనాతో కొంతమంది వ్యాపారులు ముందుగానే బియ్యం నిల్వ చేసుకుంటున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌నినో, సాగు విస్తీర్ణం తగ్గుదల, దిగుబడి అంచనాలు కూడా ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. సూర్యా పేట జిల్లాలో 54 ట్రేడింగ్‌ రైస్‌ మిల్లులు ఉండగా అందులో 26 రా రైస్‌ మిల్లులు, 28 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి.

బియ్యం ధరల పెరుగుదలతో నెలవారీగా బియ్యం కొనుగోలు చేసే కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. కిలోకు కొద్దిగా పెరిగినట్లు కనిపించినా 25 నుంచి 50 కిలోలు కొనుగోలు చేసే కుటుంబాలకు పెరుగుదల అధికంగానే ఉంటోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది.

క్వింటా బియ్యం రూ.7వేలకు పైనే

ఫ నెలలోనే క్వింటాకు

రూ.2 వేల వరకు పెరుగుదల

ఫ తగ్గిన సరఫరా, పెరిగిన

డిమాండ్‌తో ధరలకు ఊతం

ఫ ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు

తగ్గుతుందనే అంచనాలతో అధిక నిల్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement