పీఆర్‌జీటీఏ జిల్లా కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌జీటీఏ జిల్లా కార్యవర్గం

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

సూర్యాపేట : ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌ (పీఆర్‌జీటీఏ) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ.వహీద్‌ ఖాన్‌, ప్రధాన కార్యదర్శిగా పి.అంజయ్య, ఉపాధ్యక్షులుగా డి.జగన్‌, ఎస్‌కే. జానిపాషా, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్‌, కిరణ్‌, అదనపు ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీధర్‌ రెడ్డి, కార్యదర్శులుగా సీహెచ్‌.గురువయ్య, కె.సైదులు, కార్యవర్గ సభ్యులుగా సురేష్‌, రామకృష్ణ, వినీల్‌, రంగారెడ్డి, రాజ చందర్‌, గురు స్వామి, రాములు, షబానా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించి, మెరుగైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అన్ని గురుకుల సొసైటీలకు ఉమ్మడి కామన్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు చేయాలని, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు, కేర్‌ టేకర్ల నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు గుర్రం రమేష్‌ గౌడ్‌, రామకృష్ణారెడ్డి, ఉప్పు అశోక్‌, నాగేశ్వరరావు, పానుగంటి విజయ్‌, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, జానకి రాములు గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement