హుజూర్‌నగర్ : సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఎస్‌కే చాంద్‌పాషా అన్నారు. ఆది వారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలోనే సింగిల్ పర్మిట్, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై పోరాటానికి కార్యాచరణకు ఉమ్మడి పది జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర, జిల్లా కార్యవర్గాన్ని అసోసియేషన్ హుజూర్‌నగర్ నాయకులు సన్మానించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరదీధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సలహాదారులు పైడిమర్రి వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు వెంకటేష్‌గౌడ్, కమర్, మల్లారెడ్డి, సత్యం బాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కోతి సంపత్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నరసింహగౌడ్, ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఫ లారీ ఓనర్స్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి


