కోదాడ : కోదాడలోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన చెన్నెయ్షాపింగ్ మాల్ను స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిపథంలో పయనిస్తున్న కోదాడ పట్టణంలో పేరుగాంచిన చెన్నయ్ షాపింగ్ మాల్ భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించాలని యాజమాన్యాన్ని కోరారు. సినీ నటి రితికనాయక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. మాల్ యాజమాన్యం ఎమ్మెల్యేతో పాటు సినీనటి రితికనాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమకుమారి, వైస్ చైర్పర్సన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


