అర్వపల్లి : తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగా రం, జాజిరెడ్డిగూడెం మండలాల్లో ఎస్సారెస్పీ కాలు వకు సిమెంట్ లైనింగ్కు నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 71 డీబీఎం కాల్వకు నాగారం మండలం ప్రగతినగర్ గేట్ల వద్ద నుంచి జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వరకు లైనింగ్ వేయనున్నారు. ప్రగతినగర్ నుంచి తిమ్మాపురం వరకు 24 కిలోమీటర్ల దూరం ఉండగా ఇందులో ఇప్పటికే 6 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. మిగిలిన 18 కిలోమీటర్ల కాలువ లైనింగ్ కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
రూ.41 కోట్లతో ప్రతిపాదనలు
రెండు మండలాల పరిధిలోని 18 కిలోమీటర్ల 71 డీబీఎం కాలువ లైనింగ్కు రూ.41కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కాలువ లైనింగ్ పనులను చేపట్టనున్నారు. కాలువలు నిర్మించి 15 ఏళ్లు దాటినా ఇంతవరకు లైనింగ్ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు.


