త్వరలో ఆర్టీసీ విలీన తేదీ ఖరారు | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఆర్టీసీ విలీన తేదీ ఖరారు

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ప్రక్రియలో వచ్చిన సమస్యలు తెలంగాణలో రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఒక కమిటీని వేశారని, ఈ ఎన్నికల్లో గెలుపొందే గుర్తింపు సంఘంతో కలసి చర్చించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, ఆర్టీసీ ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, టీఎంయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ బలపర్చిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌, టీడబ్ల్యూయూల ఐక్య కూటమికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలికిన సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని వైట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదేళ్ల తరువాత ఆర్టీసీలో జరిగే ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలంటే టీఎంయూ బలపర్చిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌, టీడబ్ల్యూయూ ఐక్య కూటమి బాణం, నక్షత్రం గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ టీఎంయూకు మద్దతు ఇవ్వడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టిందన్నారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పోతు భాస్కర్‌, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్‌, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్స య్య, నాయకులు ధరావత్‌ వీరన్ననాయక్‌, చింతమళ్ల రమేష్‌, పాండునాయక్‌, నాగునాయక్‌, తొడుసు లింగయ్య, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్‌, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

ఫ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement