మద్దిరాల : మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 75 డబుల్ బెడ్రూం ఇళ్లలో 63 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం మద్దిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు లక్కీడ్రా తీశారు. తహసీల్దార్ తబిత, సర్పంచ్ రాంపాక నాగరాజు ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేశారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అధికారులు మోసం చేస్తున్నారంటూ కొంత మంది మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మండల కేంద్రానికి చెందిన షబాన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. తనకు ఉండడానికి ఇల్లు లేదని, మండల కేంద్రంలో బజ్జీలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, ఇల్లు ఇవ్వకుండా అధికారులు మోసం చేశారని వాపోయింది. స్థానికులు ఆమెను నిలువరించారు. పోలీసులు ఆమెతో పాటు ఆందోళన చేస్తున్న మహిళలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఫ తనకు ఇల్లు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం


