ఆసక్తి ఉండాలే గానీ.. వయసుతో పనేముంది | - | Sakshi
Sakshi News home page

ఆసక్తి ఉండాలే గానీ.. వయసుతో పనేముంది

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

మద్దిరాల : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో మండలంలోని మద్దిరాల, కుక్కడం, ముకుదాపురం గ్రామాల్లో నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు న్యూ ఇండియా లిటరసీ ప్రొగ్రాంలో భాగంగా చదువు నేర్పిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు చదువు నేర్చుకున్న వారికి ఆదివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి మహిళ చదువు నేర్చుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీ సుధాకర్‌, వీఓఏలు, మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement