హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆది, సోమవారాల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం నేరేడుచర్లలోని ఫంక్షన్ హాల్లో పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. పాలకవీడు మండలం మూసీఒడ్డు సింగారం, మేళ్లచెరువు, కందిబండలో, కప్పలకుంట తండా, వెల్లటూరు ఆర్అండ్ఆర్ కాలనీ, వేపలమాధారం, చింతలపాలెం మండలం కొత్తగూడెం, గాంధీనగర్ తండాలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సోమవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెం, రేగులగడ్డ తండాలో మహిళా సంఘం భవనాలను ప్రారంభిస్తారని మంత్రిపీఆర్ఓ వెంకట్రెడ్డి తెలిపారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : రోజురోజుకూ కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించేందుకు తక్కువ పెట్టుబడి–ఎక్కువ లాభాలు అంటూ ఆన్లైన్ పెట్టుబడి మోసాలతోపాటు ఆన్లైన్ ఉద్యోగా లు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ అరెస్ట్ వంటి వివిధ పద్ధతులపై పోస్టులు పెడుతూ పెద్ద మొ త్తంలో డబ్బులను కాజేస్తున్నారని పేర్కొన్నారు. అనధికారిక యాప్ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.
మహిళలపై
లింగ వివక్ష సరికాదు
హుజూర్నగర్ : సమాజంలో మహిళలపై లింగ వివక్ష చూపడం సరికాదని, అది సమాజ అభివృద్ధికి పెద్ద నిరోధకమని ఐకేపీ జిల్లా మేనేజర్ బెనర్జీ అన్నారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో లింగ వివక్షపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ రంగంలో పనిచేస్తున్నా మహిళలపై ఎలాంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం అనురాధ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కళ్యాణి, సీసీ నర్సయ్య, అకౌంటెంట్ సుజాత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


