మోత్కూరు : ‘తుంగతుర్తి నియోజకవర్గానికి నేనే బాస్ను, రెండో లీడర్ అనే వారు లేరు. నేను చెప్పిందే వేదం’ అని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రకటించారు. శుక్రవారం మోత్కూరులో కాంగ్రెస్ మున్సి పాలిటీ శాఖ అధ్యక్షుడిగా బద్దం నాగార్జునరెడ్డిని నియామిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు కమిటీలు వేసినా చెల్లవని, మండల కమిటీల ద్వారానే నియామకాలు తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు గమనించాలని కోరారు. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు కమిటీల అధ్యక్షుల నియామకం చేసినట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ బాలరాజుగౌడ్, పట్టణ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, నాయకులు లక్ష్మినర్సింహారెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


