సూర్యాపేట టౌన్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి వాహనాలను జాగ్రత్తగా నడపాలని, నీరు ప్రవహిస్తున్న రోడ్లు, వాగులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దన్నారు. రైతులు భారీ వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో పొలాల్లోకి వెళ్లకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలన్నారు. అత్యవసర సమయంలో పోలీసు సేవల కోసం డయల్ 112, సూర్యాపేట జిల్లా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ నంబర్లు 8712686026, 8712686057 లను సంప్రదించాలని కోరారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాలతి
సూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ కె.మాలతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె అంతకుముందు కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి, బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ జేవీడీఎస్. ప్రసాద్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు. మాలతికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్, ఆర్ఎమ్వోలు డాక్టర్ జనార్దన్, డాక్టర్ ఉపేందర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
26న జాబ్‌మేళా
భువనగిరి : జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప నాధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. కనీస విద్యార్హత టెన్త్, ఇంటర్మీడియేట్, డిగ్రీ బీఎస్సీ, ఐటీఐ, బీడీఎం ఫార్మసీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటాతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7095612963 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


