30 వేల ఎకరాల్లోనే ఆరుతడి | - | Sakshi
Sakshi News home page

30 వేల ఎకరాల్లోనే ఆరుతడి

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకునే మహిళలూ.. మీ ఫొటోలను ‘సాక్షి’ పత్రికలో చూసుకోవాలను కుంటున్నారా.. మీరు పూజలో కూర్చొని, అమ్మవారు కన్పించేలా సెల్ఫీ తీసి ఈ కింది నంబర్‌కు వాట్సప్‌ చేయండి. శనివారం సంచికలో ప్రచురిస్తాం. సెల్ఫీ ఫొటోతో పాటు మీ పేరు, ఊరు/పట్టణం, మండలం కూడా పంపాలి.

ఆదాయం రూ.3.52 కోట్లు
యాదగిరిగుట్ట ఆలయ హుండీలు లెక్కించగా రూ.3.52కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.

- 8లో

భానుపురి (సూర్యాపేట) : ఎల్‌నినో పరిస్థితుల కారణంగా జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ సీజన్‌ ముగుస్తున్నా ఇప్పటివరకు రైతులు కేవలం 30 వేల ఎకరాల్లోనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో వరిసాగు చేయకుండా రైతాంగం ఉండని పరిస్థితి నెలకొంది. అయితే గతంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 3 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇంకా వర్షాలు కురుస్తాయన్న ఆశతోనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయ సాగు అంచనా ఇలా..

జిల్లాలో 5.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ వానాకాలం పంటల సాగు అంచనాలను రూపొందించింది. ఇందులో 4.80 వేల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి ఉండగా కేవలం 68 52 ఎకరాల్లో మాత్రమే పెసర, కందులు, మినుములు వంటి ఆరుతడి పంటలు ఉంటాయని పేర్కొంది. అయితే ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఈ అంచనాలు తారుమారయ్యాయి. వరిసాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని, ఈ మేరకు ఆరుతడి పంటలు 1.40లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకుని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

22 శాతం కూడా మించలే..

సీజన్‌ ప్రారంభమైన నాటినుంచి వాతావరణ పరిస్థితులు వరిసాగుకు అనుకూలంగా ఉండవని రైతులు అరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. అయినా చాలామంది రైతులు ఈ పంటల సాగుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. అధికారులు నిర్దేశించుకున్న 1.40 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 30 వేల ఎకరాల్లో (21 శాతం) మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేశారు.

వర్షాలపై ఇంకా ఆశలు

జిల్లాలో ఇంకా 1.20 లక్షల ఎకరాల నుంచి 1.40లక్షల ఎకరాల వరకు పంటల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. వీటిల్లోనూ కేవలం ఆరుతడి పంటలు అయితేనే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రైతుల చేతికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ రైతులు ఇంకా ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని వరిసాగు చేసుకోవచ్చనే ఆశతోనే ఆరుతడి పంటలను వేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం ఎలాగైనా మిగిలిపోయిన భూమిలో ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, ఇందుకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసే పనిలో ఉంది.

ప్రత్యామ్నాయ పంటల సాగు

లక్ష్యం 1.40 లక్షల ఎకరాలు

తలకిందులైన అధికారుల అంచనా

వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నా

ముందుకురాని రైతులు

ఈ నెలాఖరు వరకు సాగుకు అవకాశం

సెల్ఫీ పంపాల్సిన వాట్సప్‌ నంబర్‌

99489 38922

ప్రత్యామ్నాయ పంటల సాగు ఇలా..

పంట విస్తీర్ణం (ఎకరాల్లో..)

పెసర 10,000

కందులు 10,000

మినుము, జొన్న,

వేరుశనగ, కూరగాయలు 20,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement