అర్వపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే ఎస్సారెస్సీ కాలు వల నిర్మాణం, గోదావరి జలాల సాధన జరిగిందని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి చేయడం తప్ప హత్య రాజకీయాలు తెలియవన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహించిందని ఆరోపించారు. అధికారం కోల్పోయిన బాధతో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కిశోర్ కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నియోజకవర్గంలో న్యాయవాది యుగేంధర్, ఓయూ నేత నగేష్‌తోపాటు అనేక మందిపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హయాంలోనే ఈప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. త్వరలో లక్ష మందితో జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ధరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, నాయకులు మడ్డి పద్మ, శిగ నసీర్‌గౌడ్, రత్నం సంతోష్, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, మంచాల రాంమ్మూర్తి, మేకల రాంబాబు, ఉప్పలయ్య, భిక్షం, శ్రీధర్‌రెడ్డి, ఖాజ, శ్రీనివాస్, యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు
గుడిపాటి నర్సయ్య


