అర్వపల్లి : యాసంగి సీజన్‌కు సంబంధించి గోదావరి జలాలను జిల్లాకు ఈ నెల 10 నుంచి 17 వరకు మరో విడుత విడుదల చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ తిరుమలగిరి డివిజన్–2 ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు 6 విడతలుగా గోదావరి జలాలు విడుదల చేశారు. అయితే వరి పంటలు చేతికందే దశలో ఉన్నాయని, నీటి విడుదలను నిలిపివేస్తే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యర్ధన మేరకు గోదావరి జలాలను చివరి విడతగా మరో వారం రోజులు విడుదల చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని వారు పేర్కొన్నారు.
టైమ్‌టేబుల్ ప్రకారం ఎస్‌ఏ –2 పరీక్షలు నిర్వహించాలి
హుజూర్‌నగర్ : రేపటి నుంచి జరిగే సమ్మెటివ్–2 పరీక్షలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించాలని డీఈఓ అశోక్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన తనఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ఎస్‌ఏ– 2 పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట హెచ్‌ఎం బీరెల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు టున్నారు.
బీసీటీయూ
జిల్లా కమిటీ ఎన్నిక
సూర్యాపేటటౌన్ : బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటీని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల దేవరాజు, కోశాధికారిగా మండవ సైదులు, గౌరవ అధ్యక్షుడిగా పోతురాజు నరసయ్య ఎన్నికయ్యారు. బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 90 శాతానికి పైగా బహుజన విద్యార్థులు చదువుతున్నారని, పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని బలోపేతం చేసేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నె శంకర్‌గౌడ్, నల్లగొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, బి. శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు లింగాల రవిగౌడ్, మన్నూరి నాగన్న, దొంగర మహేష్, నిమ్మల శ్రీనివాస్, బైరు వీరస్వామి, నాయకులు అల్లాడి సత్యనారాయణ, సురభి శ్రీధర్, రాచకొండ నాగయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో ఒడిబియ్యం
అర్వపల్లి : జనగామకు చెందిన శ్రీశైలం వనితాక్షేత్రం ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాపురంలోని సూర్యక్షేత్రంలో ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సూర్యనారాయణ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్దన్, గణపురం నరేష్, గ్రూప్ లీడర్లు గీత, వరలక్ష్మి, సంతోషి, రాజేశ్వరి, లలిత, సంధ్య, రమాదేవి పాల్గొన్నారు.
బెల్లంకొండ సైదులు, జిల్లా అధ్యక్షుడు
నేరెళ్ల దేవరాజు,
జిల్లా ప్రధాన కార్యదర్శి


