సూర్యాపేటటౌన్ : పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకన రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భోజన విరామం సమయంలో జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాల వద్ద నిరసన తెలి పారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా పదో తరగతి పేపర్ మూల్యాంకన రెమ్యూనరేషన్ పెంచడం లేదని, ఇంటర్ మీడియట్ పేపర్ దిద్దే వారితో సమానంగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పాట్ ముగిసిన వెంటనే తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరారు. అనంతరం డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు శీనయ్య, వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, పబ్బతి వెంకటేశ్వర్లు, బంధం వెంకటేశ్వర్లు, జహంగీర్, గుంటి సత్యనారాయణ, రామలింగారెడ్డి, ఆర్. లింగయ్య, యాకయ్య, ఆనంద భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన


