సాక్షి, యాదాద్రి : డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేయడంలో పోలీ సులు మరింత అప్‌డేట్ కావాలని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో భరోసా కేంద్రం, జిల్లా పోలీస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అన్నివిభాగాల్లో 15 సంవత్సరాల ముందున్నారన్నారు. దానిని కొనసాగిస్తూ సాంకేతికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మొక్కలు నాటారు. అంతకు ముందు భరోసా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం డీజీపీ స్వీకరించారు. భరోసా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మహేష్ భగవత్‌లకు ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మెమొంటోలు అందజేశారు.
జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న డీజీపీ
యాదాద్రి భువనగిరి జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్‌లో దొంగ రివాల్వర్ చోరి చేశాడని, యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయంలో దొంగతనం కేసులు తనకు ఎప్పుడు గుర్తుకు వస్తాయన్నారు. అప్పటి పోలీసులు కలిసికట్టుగా పనిచేసి దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు అని అన్నారు. అన్నిచోట్ల పనిచేయడం వేరు.. ఇక్కడ పనిచేయడం వేరన్నారు. ఎస్పీగా, రాచకొండ కమిషనర్‌గా జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పోలీస్ అధికారులతో పంచుకున్నారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, భువనగిరి డీఎస్సీలు రవీందర్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఫ డీజీపీ శివధర్‌రెడ్డి


