పాలకవీడు : మండలంలోని రావిపమాడ్‌లో శ్రీనిధి రుణాల విషయంలో అక్రమాలకు పాల్పడిన వీఓఏపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి సుశీల, మహిళలు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వీఓఏ, ఏపీఎం బ్యాంక్ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని సంఘాల ప్రమేయం లేకుండానే రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. సమావేశం నిర్వహించకుండా, తీర్మానాలు లేకుండా తమ పేర్లతో లక్షల్లో అప్పులు తీసుకున్నారని వాపోయారు. దాంతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వారు పేర్కొన్నారు. అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.


