24న ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్‌ | - | Sakshi
Sakshi News home page

24న ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్‌

Feb 18 2026 7:31 AM | Updated on Feb 18 2026 7:31 AM

24న ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్‌

24న ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్‌

భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహిస్తున్న చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేయాలని ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శులు బుడిగె పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం సూర్యాపేట డిపో ఎదుట నిర్వహించిన కార్మికుల నిరసనలో వారు మాట్లాడారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర కార్య దర్శి అంజయ్య, నల్లగొండ రీజియన్‌ కార్యదర్శి ఎన్‌ఎస్‌.గౌడ్‌, డిపో కార్యదర్శి మాచర్ల భాస్కర్‌, నాయకులు ఎం.లచ్చయ్య, పుదూరి రమేష్‌, విజయానంద్‌, హుస్సేన్‌, సైదమ్మ, అలివేలు, సుజాత, రాజేశ్వరి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement