కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి
నడిగూడెం : కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో ఘనంగా నిరనిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్‌చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, కరివిరాల సర్పంచ్ మారోజు పార్వతమ్మ, పార్టీ నడిగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్, నాయకులు అనంతుల ఆంజనేయులు, దున్నా సుధాకర్, నూనె నాగన్న, కాసాని సతీష్, మేకల వీరబాబు, దున్నా మనీషా, మహేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.


