అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

సూర్యాపేట టౌన్‌ : పోలీస్‌ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా ఆర్మూడ్‌ పోలీస్‌ విభాగం (ఏఆర్‌)లో కానిస్టేబు ల్స్‌ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, శ్రీధర్‌, భాస్కర్‌, వెంకటేశ్వర్లు, సోమయ్య, సు మన్‌, ఆనందరావులు సివిల్‌ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సిబ్బంది జిల్లా ఎస్పీ నర్సింహను బుధవారం ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. బదిలీ అయిన సిబ్బందికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరాలను నివా రించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ నరసింహా చారి, పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌గౌడ్‌, ఆర్‌ఎస్‌ఐ అన్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement