పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

సూర్యాపేట టౌన్‌ : ప్రతి విద్యార్థి ఇష్టంగా పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఇంటర్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి (డీఐఈఓ) భానునాయక్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్‌ డే వేడుకలకు డీఐఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు వీడీఎస్‌ ప్రసాద్‌, బి.వాసు, ఎస్‌కె.భాషీరున్నిసాబేగం, జి.సైదులు, ఆర్‌.గురవయ్య, బి.గోపమని, బి.లలిత, జి శ్రీనివాస్‌, టి.రమేష్‌, సీహెచ్‌ కృష్ణ, ఎం.ప్రతాప్‌, టి.వెంకటకృష్ణ, నవీన్‌కుమార్‌, లక్ష్మయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement