మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువును నిత్యం పరిశీలించాలని, పోషకాహారలోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పోషణ్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వయో వృద్ధుల మెయింటెనెన్స్ కేసులు, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మహిళలపై అకృత్యాలు జరగకుండా వారికి రక్షణగా ఉండే చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, సూపరింటెండెంట్ జి.హుస్సేన్, డీసీపీఓ రవి కుమార్, ఏఫ్‌ఆర్‌ఓ బి.వినోద్‌కుమార్, సంకల్ప జిల్లా కోఆర్డినేటర్ చైతన్య పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


