ఇంటర్నల్‌ మార్కుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్నల్‌ మార్కుల తనిఖీ

Feb 18 2026 7:31 AM | Updated on Feb 18 2026 7:31 AM

ఇంటర్నల్‌ మార్కుల తనిఖీ

ఇంటర్నల్‌ మార్కుల తనిఖీ

జిల్లాలో ఇలా..

చిలుకూరు : పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. వారికి పాఠశాలల్లో ఇచ్చిన ఇంటర్నల్‌ మార్కుల తనిఖీపై జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 34 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను సందర్శించి పదవ తరగతి ఇంటర్నల్‌ మార్కులను తనిఖీ చేస్తున్నారు.

రికార్డుల పరిశీలన

చదువులో విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఇంటర్నల్‌ మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటర్నల్‌ మార్కుల నమోదు విషయంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుడడంతో మార్కులు, రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను విద్యాశాఖ నియమించింది. ఈ బృందాలు జిల్లాలోనిఅన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నాయి.

20 మార్కులు కేటాయింపు

పదో తరగతిలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మెటివ్‌ అసైన్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు. పదో తరగతి విద్యార్థి భవిష్యత్‌కు ఈ మార్కులు కీలకంగా మారిన నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్‌, చేతి రాత, ఎఫ్‌ఏల్లో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మెటివ్‌ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా, ఇష్టానుసారంగా నమోదు చేశారా అన్న విషయాన్ని తనిఖీ బృందాలు పరిశీలించనున్నాయి.

సూర్యాపేట జిల్లాలో 184 ప్రభుత్వ, 121 ప్రైవేటు పాఠశాలలు, 50 కెజీబీవీ, గురకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మొత్తం 10,016 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి రికార్డులు తనిఖీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 34 బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో జీహెచ్‌ఎమ్‌ లేదా ఎఫ్‌ఏసీ హెచ్‌ఎం, లాంగ్వేజ్‌ పండిత్‌, మరో నాన్‌ లాంగ్వేజ్‌ ఉపాధ్యాయుడు, స్కూల్‌ అసిస్టెంట్‌తో పాటు మరి కొందరు ఉపాధ్యాయులు కలిపి ఐదు నుంచి ఏడుగురు ఉంటారు. ఒక్కో బృందానికి 7 నుంచి 10 పాఠశాలల బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేసి ఇంటర్నల్‌ మార్కులను ఆన్‌లైన్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫ టెన్త్‌ విద్యార్థుల ప్రగతి పరిశీన

ఫ జిల్లా వ్యాప్తంగా 34 బృందాలు

ఫ జిల్లాలో 355 ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు

ఫ వార్షిక పరీక్షకు హాజరు కానున్న 10,016 మంది విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement