నేడు మేళ్లచెరువుకు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మేళ్లచెరువుకు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మంత్రి హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో మేళ్లచెరువుకు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు హెలికాఫ్టర్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు కోదాడ విద్యార్థులు
కోదాడ: కోదాడలోని ఈఆర్‌ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ విద్యార్థులు సీఎంకప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌లు ఫాజిల్, నిస్సార్ తెలిపారు. ఇటీవల కేంద్రంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో అకాడమీకి చెందిన గౌతమ్, సంతోష్, అనస్, ఆరిజ్, రక్షిత్, జానిభాష పాల్గొని ప్రతిభ కనబర్చి నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం కోచ్‌లతో పాటు స్థానికులు అభినందించారు.
కాల్వకట్ట వద్ద ప్లాస్టిక్
మేనేజ్‌మెంట్ గోదాం
నడిగూడెం : మండల కేంద్రం సమీపంలో సాగర్ ఎడమ కాల్వ కట్ట వద్ద ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ గోదాం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు కృషి చేస్తామని పంచాయతీరాజ్ డీఈ హర్ష తెలిపారు. మంగళవారం ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ గోదాం నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ బుసిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఎంపీఓ విజయలక్ష్మి, ఆర్‌ఐలు గోపాలకృష్ణ, మల్సూర్, పంచాయతీ కార్యదర్శి ఎలకా ఉమారాణి, జీపీఓ కోటయ్య ఉన్నారు.
లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీసమేత లక్ష్మీ నరసింహస్వామికి సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం
చిలుకూరు : ప్రజాబాట కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీని వాస్‌రావు అన్నారు. మంగళవారం చిలు కూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తున్నారని, దాని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రజాబాటకు ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజా బాటపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ వెంకటకృష్ణయ్య, ఏఈ శ్రీనివాస్‌రావు, సబ్ ఇంజనీర్ పరశురాములు, లైన్‌ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, శాంతకుమార్, సర్పంచ్ పుల్లమ్మ, ఉపసర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు మేళ్లచెరువుకు మంత్రి ఉత్తమ్ రాక
నేడు మేళ్లచెరువుకు మంత్రి ఉత్తమ్ రాక


