రవీందర్‌కు అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
సూర్యాపేట : తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగాపూర్ బీఈడీ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సూర్యాపేటకు చెందిన డాక్టర్ ఎస్.రవీందర్‌కి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏపీజే.అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు–2025కి ఎంపికై నట్టు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల డాక్టర్ రవీందర్‌కు ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెంట్ అవార్డు–2025 అందుకున్నానని పేర్కొన్నారు. ఈ రెండు అవార్డులు ప్రతిష్టాత్మకమైన త్రేతా యుగ్ ఫౌండేషన్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.


