రాజ్యాంగం వల్లే సమాన హక్కులు
తిరుమలగిరి : భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందని జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం మద్దిరాల మండలం ముకుందాపురంలోని హెచ్‌ఎన్‌ఎల్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి గాగాలేని ప్రతిఒక్కరూ జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయసహాయం పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాఅధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఫర్హీన్‌కౌసర్, జూనియర్ సివిల్‌జడ్జ్ ఎండి గౌస్‌పాషా, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొంపెల్లి లింగయ్య, సీఐ నర్సింహారావు, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ మెంబర్స్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


