ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి
సూర్యాపేట: ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఎస్పీ నరసింహ అన్నారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా శనివారం సూర్యాపేట మండల పరిధిలోని జాతీయ రహదారి–65, ఖమ్మం జాతీయ రహదారిపై పలుచోట్ల రోడ్డు ప్రమాద స్థలాలు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువ జరుగుతున్నాయని, ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయని అధ్యయనం చేసి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లు, మూలమలుపులు, గ్రామాల వద్ద హెచ్చరిక బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


