
ప్రమాణస్వీకార మహోత్సవం విజయవంతం చేయాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కౌన్సిల్ సభ్యుడు బండారు రాజా కోరారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని పలువురు ఆర్యవైశ్యులకు జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్‌తో కలిసి ప్రమాణ స్వీకార కరపత్రాలను అందజేశారు. అనంతరం బండారు రాజా మాట్లాడుతూ.. ఆదివారం కోదాడలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ నాయకులు విచ్చేస్తున్నందున పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తప్సీ గాంధీ, నరేంద్రుని విద్యాసాగర్ రావు, గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం, కొండ శ్రీనివాసరావు, నాయకులు బొల్లం సురేష్, ఉప్పలంచు కృష్ణ, నరేందర్ పాల్గొన్నారు.