క్రీడా పాఠశాల పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాల పిలుస్తోంది

Jun 15 2025 7:12 AM | Updated on Jun 15 2025 7:12 AM

క్రీడా పాఠశాల పిలుస్తోంది

క్రీడా పాఠశాల పిలుస్తోంది

ఎంపిక పోటీల తేదీలు

మండల స్థాయిలో ఈనెల

16 నుంచి 19 వరకు.

జిల్లాస్థాయిలో 23 నుంచి 26వ తేదీ.

రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ.

అర్హతలు

ఫ మూడవ తరగతి చదివిన విద్యార్థులు

ఫ 1– 9– 2016 నుంచి 31– 8– 2017 మధ్య జన్మించి ఉండాలి

ఫ ఎత్తు 127–147 సెంటీమీటర్లు

ఫ బరువు 24 కేజీల నుంచి 33 కేజీల మధ్య ఉండాలి

సూర్యాపేట అర్బన్‌ : రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో (కరీంనగర్‌, ఆదిలాబాద్‌, హకీంపేట) ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగో తరగతిలో చేరేందుకు రాష్ట్రంలో ఈ మూడు స్పోర్ట్స్‌ స్కూళ్లలో అవకాశం ఉంది. చదువుతోపాటు ఆటల్లో రాణించాలనుకునే వారికి ఇక్కడి విద్యాభ్యాసం గొప్ప అవకాశం. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఎదగడానికి అవసరమైన మెలకువలు ఇక్కడ నేర్పిస్తారు. ఒలంపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రాణించిన క్రీడాకారులకు అవార్డులు, నజరానాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయి. తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశాల ప్రక్రియ ఈనెల 16 నుంచి మొదలు కానుంది. మండల స్థాయిలో 16వ తేదీ నుంచి 19 వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో 23వ తేదీ నుంచి 26 వరకు, రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు, జిల్లా స్థాయిలో సత్తా చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు హకీంపేటలోని క్రీడా పాఠశాలలో జరుగుతాయి. ఈ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసి మూడు పాఠశాలల్లో మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.

ఈ క్రీడల్లో శిక్షణ

ఎంపికై న విద్యార్థులకు 12 క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తారు. స్విమ్మింగ్‌, జూడో, విలువిద్య, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, ట్రై సైక్లింగ్‌, ఫెన్సింగ్‌, యోగా, రెజ్లింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడాశిక్షణతో పాటు నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8:30 వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు శిక్షణ ఉంటుంది.

సామర్థ్య పరీక్షలు

800 మీటర్ల పరుగు, 30 మీటర్ల లైన్‌ స్టార్స్‌ స్టాండింగ్‌, బ్రాడ్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌ తో సిక్స్‌ బై టెన్‌ మీటర్స్‌, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌, వర్టికల్‌ జంప్‌ తదితర టెస్టులు నిర్వహిస్తారు. ప్రతి టెస్ట్‌ కు మూడు మార్కులు ఉంటాయి.

ఈ పత్రాలు తప్పనిసరి

మూడవ తరగతి మార్కుల రికార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్‌, తహసీల్దార్‌, పంచాయతీ లేదా మున్సిపల్‌ అధికారులు జారీచేసిన కుల జనన ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డు జీరాక్స్‌, ఒరిజినల్‌ పత్రాలు.

ఫ 2025–26కు సంబంధించి

ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఫ ఈనెల 16 నుంచి 19 వరకు

మండల స్థాయిలో ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement