ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
కోదాడ: సేవాగుణం కలిగిన ఆర్యవైశ్యులు వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. ఆదివారం కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జిల్లావైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గడిచిన 30 సంవత్సరాలుగా మంత్రి ఉత్తమ్‌తో పాటు తనకు అండగా ఆర్యవైశ్యులు నిలిచారని, వారికి తాము ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఆర్యవైశ్యులు చేపట్టే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లోని ముందుండడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంపటి వెంకటేశ్వరరావు, ఇమ్మడి సోమనర్సయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరితో పాటు కార్యవర్గ సభ్యులచే ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర, జిల్లా నాయకులు.. ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, మహా సభ ప్రతినిధులు చల్లా లక్ష్మీకాంత్, కక్కిరేణి శ్రీనివాస్, వంగవేటి శ్రీనివాస్‌రావు, ఇరుకుల చెన్నకేశవరావు, ఓరుగంటి నాగేశ్వరరావు, ఓరుగంటి విజయలక్ష్మి, బొమ్మిడి అశోక్, చల్లా అశోక్, స్వామి గణేశ్, డాక్టర్ భరత్‌చంద్ర, ఇమ్మడి అనంత చక్రవర్తి, భరత్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి


