చిన్నారులను ఉదయం ఎండలో ఉంచాలి
● చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, శాస కోశ సంబంధిత సమస్యలు, జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే ప్రమాదం ఉంది.
● చిన్న పిల్లలకు స్వెటర్లు వేసి చెవులకు మంకీ క్యాపు పెట్టాలి. కాళ్లకు చేతులకు సాక్సులు, గ్లౌజ్‌లు వేయాలి.
● పాలు తాగే నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి.
● ఉదయం ఎండలో ఉంచాలి. ● చిన్నారులతో ఉదయం సమయంలో ప్రయాణం చేయొద్దు.
● రాత్రి వేళల్లో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచి.. వెచ్చదనం కోసం వేడినిచ్చే హైవోల్టేజీ బల్బులు వేయాలి.
● కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. వేడి ఆహారం తినిపించాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయం తాగించొద్దు.
– డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పిల్లల వైద్యుడు, నల్లగొండ
చిన్నారులను ఉదయం ఎండలో ఉంచాలి


