రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాల నివారణకు వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ ప్రత్యక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు –2026కు సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్ లతో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 26శాతం మరణాలు, 9శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ సీతారామయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జీఎం సీతారాం, వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


