– సాక్షి నెట్‌వర్క్
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, చల్లని గాలులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది.
సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు వణుకు పుట్టిస్తోంది. మంచు కురుస్తుండడంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. చలి నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చల్లదనంతో ఆస్తమా కూడా పెరుగుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా జరిగి నిమోనియా కేసులు నమోదవుతాయి. రద్దీగా ఉండే విహార యాత్రలకు వెళ్లవద్దు. రోగులు సక్రమంగా మందులు వేసుకోవాలి. ఏమైనా సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ రాఘవేందర్‌రెడ్డి,
పల్మనాలజిస్ట్, నల్లగొండ
చలి కాలంలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్, రాగి జావ, సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, బత్తాయి పండ్లతో పాటు ఆకు కూరలు తినాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఉత్తమం. విటమిన్–డి అందేలా సూర్యరశ్మిలో నిల్చోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. విటమిన్–సి, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– ఎం. శ్రీనివాసరావు, డైటీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండ
వృద్ధులు మరింత జాగ్రత్త
– సాక్షి నెట్‌వర్క్
– సాక్షి నెట్‌వర్క్
– సాక్షి నెట్‌వర్క్
– సాక్షి నెట్‌వర్క్
– సాక్షి నెట్‌వర్క్


