బొల్లినేనిలో నూతన కోర్సులకు ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

బొల్లినేనిలో నూతన కోర్సులకు ఎంఓయూ

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

శ్రీకాకుళం రూరల్‌ :

నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రాగోలు జెమ్స్‌లో బొల్లినేని మెడిస్కిల్స్‌ మరింత మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా విశాఖలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌తో నూతన కోర్సులకు ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌, ప్రొడక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌, జూనియర్‌ బ్యూటీ థెరపిస్ట్‌, అసోసియేట్‌ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 800 మందికి ఈ ఏడాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐలు చదివి 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీఐ (హెచ్‌పీసీఎల్‌) సీఈఓ అండ్‌ సెక్రటరీ పి.విజయ్‌కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ కల్యాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement